
అనంతపురం, (జనస్వరం) : రాష్ట్ర ప్రభుత్వం పీఆర్పీని ఆమోదింపచేసే కుట్ర పన్నుతోంది. చీకటి జీవోలను రద్దు చేసిన తర్వాత చర్చలకు వస్తావని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేసిన తర్వాత కూడా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలలో చీలికలు తెచ్చి కొత్త సంఘాల్ని తయారుచేసి వారితో చర్చలు జరపాలని చూడడం సహేతుకం కాదు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలు మాత్రమే ఇస్తే బాగుంటుందని… సకల శాఖమంత్రిగా ఆయన వ్యవహరించడం ఏమిటని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ…రాష్ట్రములో ఏ సమస్య వచ్చినా సంబంధిత శాఖమంత్రి, ముఖ్యమంత్రి మాట్లాడడం లేదని… సజ్జల రామకృప్టారెడ్డి మాత్రమే ప్రెస్మీట్లు పెట్టి తనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. మరి అలాంటప్పుడు మంత్రివర్గంలో ఇంత మంది మంత్రులు ఎందుకని.. లేకపోతే జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలోని మంత్రులకు సంబంధిత శాఖలపై అవగాహన లేని కారణంగానే సజ్జల రామ కృష్ణా రెడ్డి మాట్లాడుతున్నారా.. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు 2015 పీఆర్సీ ప్రకారం కొత్త డిఏలను కలిపి జీతాలు ఇవ్వాలని కోరుతుంటే.. ఈ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రివర్స్ పిఆర్సి ద్వారానే జీతాలు చెల్లిస్తామని ముందుకెళ్లడం పద్ధతి కాదన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఉద్యోగుల పక్షాన ఉద్యమాన్ని నిర్మిచేందుకు సైతం వెనకాడబోమని జయరామిరెడ్డి స్పష్టం చేశారు.