
అనంతపురం, (జనస్వరం) : రాష్ట్రంలో రోజూ ఎక్కడో చోట మహిళలపైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు ప్రభుత్వం రక్షణ కల్పించలేదు అని అర్ధమైపోయింది? పోలీసులే రక్షణ కల్పించాలని అనంతపురం జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి మహిళలకు రక్షణ కల్పించలేక తిరుపతి సభలో ప్రతిపక్షాలే అత్యాచారాలు చేయిస్తున్నారు అని నిందించడం సిగ్గుచేటు, హేయమైన చర్య. జగన్ మోహన్ రెడ్డి సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేయకుండా రాజకీయ కోణంలో విమర్శలు చేయడం చాలా బాధాకరం. కేవలం మరలా తన అధికారం నిలుపుకోవడం కోసమే ప్రవర్తిస్తున్న తీరు సిగ్గుచేటు. కాకినాడ సభలో చంద్రబాబునాయుడు మాట్లాడిన మాటలు చాలా విడ్డూరం. మరల తను ముఖ్యమంత్రి అయితే అసెంబ్లీకి వస్తారట! రాష్ట్ర ప్రజలు నీ అవసరంలేదని 2019 ఎన్నికలలోనే తీర్పు ఇచ్చారు? ఇంకా ఈ పెద్దమనిషి అర్థం కావట్లేదు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కౌలు రైతుల సమస్యల పట్ల స్పందిస్తున్న తీరు, రాష్ట్ర ప్రజలే కాక దేశ ప్రజలు హరిస్తున్న తరుణంలో ఈ సమస్యను పక్కదోవ పట్టించి ప్రజల దృష్టిని మళ్లించే కోసం, అధికార పక్షం — ప్రతిపక్షం దొంగ నాటకాలు ఆడుతున్నారని, అలాగే ప్రజలని మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను కులమతాలగా విభజించి వీరు అధికార కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని అన్నారు.