అనంతపురం ( జనస్వరం ) : ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ కల్లాం గారు కాకినాడ JNTU విద్యార్థుల సభలో వైసీపీ పార్టీకే ఓట్లు వేయాలని మీ తల్లిదండ్రులకు చెప్పండని వైసిపి పార్టీ ప్రచార సభ్యుడి లాగా విద్యార్థుల ముందు మాట్లాడుతున్నారు. ప్రతి నెల ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా? మాట్లాడడం ఎంతవరకు సబబు తీవ్రంగా ఖండిస్తున్నామని అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు లాయర్ జయరాం రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన బహిరంగ చర్చకు సిద్ధమా? అన్నారు. చట్టాల పైన కనీస అవగాహన లేని మీలాంటి మూర్ఖులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారని, వారికి కేసులు రావని, న్యాయవాదుల భృతికి ఇబ్బంది అవుతుందని దురుద్దేశంతో, నీచాది నీచంగా వ్యాఖ్యానించడం చాలా బాధాకరం అని అన్నారు. రెవెన్యూ శాఖలో ఇప్పటికే కొంతమంది అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలగఒగ్గి తప్పుడు రికార్డులు సృష్టిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న తీరు మీలాంటి మేధావుల కంటికి కనపడట్లేదా? అన్నారు. రెవెన్యూశాఖ అధికారులకు భూ యజమానుల హక్కులు నిర్ణయించే అధికారం కలిపిస్తే, ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. ఎందుకంటే రెవెన్యూశాఖ అధికారుల పైన రాజకీయ నాయకులు పెత్తనం చెలాయిస్తూ, ఒత్తిడి తెచ్చి భూ యజమాన హక్కులని విచ్చలవిడిగా అన్యాక్రాంతం చేస్తారు? తద్వారా సివిల్ కేసులన్నీ? క్రిమినల్ కేసులుగా మారుతాయి? ప్రజలు భూ హక్కుల కోసం తగాదాలు పడి, క్రిమినల్ కేసులు పెట్టుకోవడం వలన న్యాయవాదులకు క్రిమినల్ కేసులు వచ్చి విపరీతమైన లబ్ధి చేకూరుతుందని తెలుసుకో తప్పుడు ఆలోచనలతో దురుద్దేశంతో ప్రజలను తప్పుదోవ పట్టించకు? అని అన్నారు. విలేకరులు ఇలాంటి చట్టం ఎక్కడైనా అమలులో ఉందా అని నిన్ను అడిగితే? టైటిల్ గ్యారెంటీ చట్టం ఆస్ట్రేలియా, రష్యా, అమెరికా, కెనడా, బ్రిటన్, కామన్వెల్త్ తదితర 100 దేశాల్లో అమల్లో ఉందని మీరు సెలవిచ్చారు? మన దేశ భౌగోళిక స్థితిగతులకు, ఇతర దేశాల భౌగోళిక స్థితిగతుల పరిస్థితులకు తేడా తెలియని నీలాంటి మూర్ఖులు, దురుద్దేశ పూరితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా తప్పుడు సలహాలు ఇస్తూ? తప్పుడు చట్టాలు చేస్తూ? ఎవరైనా ఇదేమి అన్యాయం అని అడిగితే వారి పైన నిందలు వేస్తూ మీ వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రవర్తిస్తున్న తీరు దురదృష్టకరం? అన్నారు. మరో వంద రోజుల్లో జనసేన - టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దురుద్దేశాలకు అనుకూలంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి చట్టాలను తెచ్చి సీఎం జగన్ రెడ్డి మరియు వారి టీం సభ్యులకు లబ్ధి చేకూర్చాలని దురుద్దేశంతో తెచ్చిన తప్పుడు చట్టాలన్నిటిని రద్దుచేసి మీలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నామని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com