గోరంట్ల, (జనస్వరం) : అనంతపురం జిల్లా, పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని 4వవార్డుకు చెందిన నౌషాద్, అఖిల దంపతులకు చెందిన కుమారుడు ఇటీవల అనారోగ్యంతో మృత్యువాతపడ్డాడు. ఈ సమాచారం తెలుసుకున్న మండల జనసేన శాఖ ఆధ్వర్య౦లో జిల్లా కార్యదర్శి సురేష్ తన వంతు ఆ కుటుంబానికి సాయం అందించడానికి ముందుకు వచ్చాడు. అనుకున్నదే తడువుగా జిల్లా కార్యదర్శి సురేష్, మండల నాయకులు వెంకటేష్, బండారు మల్లికార్జున, పావుతోట వెంకటేష్, అనిల్‌కుమార్, నరేష్, గంగరాజుల ఆధ్వర్యంలో బాధిత కుటుంబం వద్దకు చేరుకుని కుటుంబసభ్యులకు 5 వేల రూపాయల నగదు అందచేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో సైతం తమవంతు బాధ్యతగా అండగా వుంటామని ఆ కుటుంబానికి హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.