Search
Close this search box.
Search
Close this search box.

అంగన్వాడి భవనంలో చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు మంచి పౌష్టిక ఆహారం అందించాలి : టి.సి.వరుణ్

అంగన్వాడి

         అనంతపురం ( జనస్వరం ) :  అనంతపురము, నారాయణపురం పంచాయతీలోని ASR, Gopal నగర్లలో పరిధిలోని గుంతల రహదారులకు మరమ్మత్తులు చేశారు. అనంతరం పలు సమస్యలపై అర్బన్ ఇంచార్జ్ & జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ పంచాయతీలోని ASR, గోపాల్ నగర్ లలో డ్రైనేజీ, విద్యుత్తు మంచినీటి సమస్యలు అలాగే అంగడివాడి భవనంలో చిన్నారుల మరియు గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. నగర అధ్యక్షులు పొదిలి బాబురావు గారు, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య మీడియా వారితో మాట్లాడుతూ పారిశుద్ధ సమస్యలతో, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నదని 2వ వార్డు ల్లోని అంగన్వాడి భవనంలో విద్యుత్తు సరిగా లేకపోవడంతో పాటుగా ప్రతి వీధిలోనూ, డ్రైనేజీలు, కుళ్ళునీరు, చెత్త చెదారాలతో పేరుకుపోయి దోమలు బెడదతో ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. ప్రజా సమస్యలు మీరు గాలికి వదిలేశారని ఏనాడైనా వార్డుల్లో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి తిరిగారా అని వైసిపి ప్రజా ప్రతినిధులను నిలదీశారు. కేవలం ఓట్లు కోసమే వస్తారని. ప్రజలకు సమస్య వస్తే, కంటికి కనిపించని నాయకులు మీరు.. పరిపాలన సాగించేదని ఇలాంటి దౌర్భాగ్యమైన పరిపాలన ఎన్నడూ చూడ లేదని వార్డులోని స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. అనంతరం ASR నగర్ ప్రాంతాలలో శిధిలమైన రహదారులకు అనంతపురం అర్బన్ నాయకులు, జనసైనికులు కలసి ఎర్రమట్టి వేసి గోతులను పూడ్చి చదును చేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శులు మేదర వెంకటేశులు, దారాజ్ భాష, జిల్లా సంయుక్త కార్యదర్శులు విజయ్ కుమార్, ముప్పూరి కృష్ణ, నగర కార్యదర్శిలు విశ్వనాథ్, మురళి, లాల్ స్వామి, సంపత్, నగర కార్యదర్శులు వెంకటరమణ, ఆకుల అశోక్, పవన్, కార్యక్రమాల కమిటీ సభ్యులు సంతోష్ కుమార్ మరియు నాయకులు రామ్మోహన్, చిరు, పవనిజం రాజు, వడ్డే వెంకటేష్, మళ్లీ, నౌషాద్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way