ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు కాకినాడలోని ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయం శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో ధాన్యం సేకరణ కోసం ఈ నియామకాలను చేపట్టింది. ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ సమయం 2 నెలలు.
జాబ్స్ .. దరఖాస్తుకు ఎల్లుండి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి
ఖాళీల వివరాలు:
S.No. | పోస్టు | ఖాళీలు |
1. | టెక్నికల్ అసిస్టెంట్ | 275 |
2. | డేటా ఎంట్రీ ఆపరేటర్ | 275 |
3. | హెల్పర్ | 275 |
మొత్తం: | 825 |
టెక్నికల్ అసిస్టెంట్:అగ్రికల్చర్, మైక్రోబయోలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, BZC తదితర విభాగాల్లో బ్యాచలర్ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వయస్సు 21-40 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయో పరిమితి 45 ఏళ్లు.
డేటా ఎంట్రీ ఆపరేటర్:అభ్యర్థులు డిగ్రీ చేసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్ లో పీజీ డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. వయస్సు 21-40 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట వయస్సు 45 ఏళ్లు.
హెల్పర్స్:8-10వ తరగతి విద్యార్హత కలిగిన వారికి అవకాశం ఉంటుంది. వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం:అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా తమ దరఖాస్తులను కావాల్సిన ధ్రువపత్రాల జీరాక్స్ కాపీలను జత చేసి కింది చిరునామాకు సెప్టెంబర్ 2లోగా చేరేలా పంపించాల్సి ఉంటుంది.
దరఖాస్తులు పంపించే చిరునామా:డిస్ట్రిక్ట్ సప్లైస్ మేనేజర్, ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, కలక్టరేట్ కాంపౌండ్, కాకినాడ .
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com