క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్, డిస్నీ+హాట్‌స్టార్ ఆసియా కప్ 2023, ICC పురుషుల ODI ప్రపంచ కప్ వంటి రెండు ముఖ్యమైన టోర్నమెంట్లను చూడటానికి మొబైల్ వినియోగదారులకు ఉచిత స్ట్రీమింగ్‌ను అందించనుంది.
ఈ మేరకు ఈ విషయాన్ని ఇవ్వాల (శుక్రవారం) ఓటీటీ ప్రతినిధులు వెల్లడించారు.
దేశం అంతటా 540 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆసియా కప్, ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌లను ఉచితంగా చూసే అవకాశాన్ని పొందుతారని వారు తెలిపారు. ఆసియా కప్ టోర్నీ ప్రారంభానికి కేవలం 9 రోజుల సమయం మాత్రమే ఉండగా హాట్ స్టార్ తీసుకున్న నిర్ణయంతో యూజర్లు హ్యాపీ గా ఉన్నారు. అయితే ICC ODI ప్రపంచ కప్ అక్టోబర్ 5న ప్రారంభమవుతుంది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com