గుంటూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు ఈ రోజున చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం తో శాంతియుతంగా అసెంబ్లీకి వెళ్తున్న జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ , నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి గారిని మరియు నాయకులకు కార్యక్రమానికి వెళ్లొద్దంటూ పోలీస్ అధికారులు నోటీసు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి గారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకే మా అధినేత పవన్ ఆశయం.. ఆ దారిలోనే మేము నడుస్తున్నాము. ప్రజా వ్యతిరేకత విధానాలపై నిరంతరం పోరాటం చేస్తాము. అధికారం వాళ్లతో వైసిపి నాయకులు చేస్తున్న అక్రమ ఇసుక దోపిడీని వెంటనే నిలిపివేయాలని నేడు చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడితే నిన్న రాత్రి నుంచే అక్రమంగా మా నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. అక్రమ అరెస్ట్ చేయటంను జనసేన పార్టీ తరఫునుంచి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామంటే ఎందుకు అంత భయం అంటు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అయిన ప్రజలకు ఎలా మంచి చేయాలనే ప్రయత్నాలు చేయాలని వాటి మీద దృష్టి పెట్టాలని అన్నారు. ఇలాగే జరిగితే మీకు కాదు 175 సీట్లు మాకు వస్తాయంటు, ప్రజా వ్యతిరేకత విధానాలపై మాత్రమే మేము పోరాటం చేస్తున్నామని అన్నారు. ఇలాంటి అరాచక పాలన ఇకనుంచి మానుకోకపోతే రాష్ట్రంలో ఈ పాలనకు ఇంకా 6 నెల్లలు మాత్రమే అంటు తనదైన శైలిలో హెచ్చరిక జారీ చేశారు, జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి తెలిపారు