Logo
Date of Publish : 28 July 2022, 8:36 am
Editor : Sake Naresh

తక్షణమే గొల్లాది వంతెన నిర్మించాలి : బొబ్బిలి జనసేన నాయకులు

     బొబ్బిలి, (జనస్వరం) : బొబ్బిలి నియోజకవర్గంలో బాడంగి మండలంలో గొల్లాది గ్రామంలో తక్షణమే బ్రిడ్జి నిర్మించాలని జనసేన పార్టీ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జ్ గిరాడ అప్పలస్వామి మాట్లాడుతూ గత వారం రోజులుగా బ్రిడ్జి నిర్మాణం కొరకు అన్ని మీడియాల్లో వెల్లడిస్తూ తక్షణమే ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరడం జరిగింది. ఈ నదిపై బ్రిడ్జి లేకపోవడం వల్ల 12 గ్రామాల ప్రజలు పెద్దవాళ్లు, స్కూల్ కి వెళ్లే పిల్లలు, పనులకు వెళ్లే కూలీలు, పొలానికి వెళ్ళే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కొరకు గతంలో 7,90,000,00 కోట్ల రూపాయలు ఆమోదించారు. గత ప్రభుత్వములో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా నిర్లక్ష్యం వహించారు. ఈసారి ఈ ysrcp ప్రభుత్వం అయినా సరే తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరుతున్నామని తెలిపారు. నియోజకవర్గం నాయకులు గంగాధర్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గోల్లాది గ్రామంలో మీరు నిర్మించబోయే గడపగడపకు ప్రోగామ్ లో గ్రామ ప్రజలు నిలదీయడానికి రెడీగా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి బాడ్ంగిలో పాదయాత్ర చేస్తున్నప్పుడు గొల్లది బ్రిడ్జి నిర్మాణం తప్పకుండా నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మూడుసంవత్సరాలు గడిచినా ఇంకా దానిమీద చలనం లేదని వాపోయారు. కావున తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేయాలని మీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలని మీకు గుర్తు చేస్తూ ఈరోజు మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సంచనా గంగాధర్, దివ్య, లంక రమేష్, అడబాల నాగు, బుడి రాజా, పల్లెం రాజా, పొట్నూరు జనార్ధన్, పైల హరి, పిట్టల కిరణ్, చంద్రమౌళి, శివ, సత్య జన సైనికులు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com