
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 277వ రోజున 47వ డివిజన్ గిడ్డంగి వీధిలో జరిగింది. అడుగడుగునా స్వర్ణకారులు కేతంరెడ్డికి శాలువలు, పూలమాలలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ముంబై నగరం తర్వాత స్వర్ణకారులు ఎక్కువగా నివసించే ప్రాంతం మన నెల్లూరు అని, ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎన్ని మారినా స్వర్ణకారుల జీవితాల్లో మార్పులు రాలేదని, కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే వీరి భవిష్యత్తుకి భరోసా కల్పిస్తున్నారని అన్నారు. అందుకే నేడు స్వర్ణకారులు తమను అపూర్వంగా ఆదరిస్తున్నారని, రేపటి రోజున పవనన్న ప్రభుత్వంలో ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.