Search
Close this search box.
Search
Close this search box.

గొడుగుమామిడి గ్రామస్తులు జనసేనపార్టీలోకి చేరిక

గొడుగుమామిడి

         జి.మాడుగుల ( జనస్వరం ) : పెదలోచలి పంచాయితి గొడుగుమామిడి గ్రామస్తుల పిలుపు మేరకు స్థానిక నాయకులు బాలకృష్ణ ఆధ్వర్యంలో గ్రామస్తులతో సమావేశమైన జనసేనపార్టీ నాయకులు అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా..వంపూరు గంగులయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, చింతపల్లి మండల బూత్ కన్వీనర్ ఉల్లి సీతారామ్, తాంగుల రమేష్ తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా డా..గంగులయ్య గారు మాట్లాడుతూ ఈ గ్రామంలో సమావేశమవుతున్నందుకు సంతోషంగా ఉందని మీరే మమ్మల్ని స్వచ్ఛందంగా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. ప్రస్తుతం మన గిరిజన ప్రాంత రాజకీయాలు పరిశీలిస్తే అసమర్థ నాయకత్వంతో మన హక్కులు, చట్టాలు ఒక్కొక్కటి నెమ్మదిగా కోల్పోతున్నమన్నారు. గిరిజనులుగా మనం మన హక్కులు, చట్టాలు కోసం తెలుసుకోవాలిసిన అవసరం ఎంతైనా ఉంది. నేడు మన గిరిజన పల్లెలు అభివృద్ధికి వెచ్చించే నిధులు సైతం దారి మళ్లించి మనల్ని మోసం చేస్తున్నారు. మళ్ళీ ఇంకో దఫా మోసం చెయ్యాలని చూస్తున్నారన్నారు. నిజానికి గిరిజన ప్రజలు వాస్తవాలు తెలుసుకుని జాతికి ద్రోహం తలపెట్టిన వైసీపీ పార్టీకి ఓటువేస్తే కచ్చితంగా ఆదివాసీ సమాజానికి ద్రోహం చేసినట్టేనని, జాతికి రక్షణ కల్పించాల్సిన మన ప్రజాప్రతినిధులు బానిసత్వం ప్రకటించేసి చేతులు దులిపేసుకున్నారు. ఇంకేమి రక్షణ కలిపిస్తారు మన గిరిజన ప్రజలకు? జాతికి తీరని ద్రోహం చేసి ఇప్పుడు నిస్సిగ్గుగా ప్రజల దగ్గర ఎలా వెళ్లగలుగుతున్నారో? ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు. నిజానికి గిరిజనులు అమాయకులు వీళ్ళని ఎలాగైనా మభ్యపెట్టవచ్చు మాయ చేసేయొచ్చు అనుకుంటున్నారు. ఇలాంటి నీచపు రాజకీయాలు చేసే వాళ్ళతో గిరిజనులంతా జాగ్రత్తపడాలని అన్నారు. లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ మాట్లాడుతూ మనమంతా గిరిజన జాతి కుటుంబ సభ్యులమే మన భవిష్యత్ మారలన్నా,భవిష్యత్ తరాలు బాగుండాలనుకున్నా జనసేనపార్టీ సిద్ధాంతపు రాజకీయాలే గిరిజనులకు శరణ్యమని, అలాగే భవిష్యత్ తరాల కోసం విలువైన ఓటు హక్కు విలువను మన జాతి రక్షణ కోసం ఉపయోగిస్తే భవిష్యత్ తరాలకు భద్రతనిచ్చిన వాళ్ళమవుతామని అన్నారు. తాంగుల రమేష్, ఉల్లి సీతారామ్ మాట్లాడుతూ మనమంతా కలిసి కట్టుగా ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని రాష్ట్రానికి కరోన వైరస్ కంటే కూడా వైసీపీ వైరస్ మంచిది కాదని ఈ మాయరోగన్ని పారద్రోలాలని అన్నారు. ఈ సందర్బంగా గ్రామ పెద్దలు, యువత,మహిళలు పెద్దఎత్తున జనసేనపార్టీ లో చేరారు. వారికి డా..గంగులయ్య జనసేనపార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జి.మాడుగుల మండల నాయకులు జల్లి బుజ్జిబాబు, కిముడు మోహన్, పాంగి మత్స్యకొండబాబు, వీరమహిళలు గండిరి పార్వతి, పద్మ, పాడేరు మండల పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్, అశోక్, సంతోష్ గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way