మాడుగుల, (జనస్వరం) : గోవాడ షుగర్స్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మికులు చేపట్టిన సమ్మెకు మాడుగుల జనసేన పార్టీ మద్దతు తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25సంవత్సరాల సర్వీసును పరిగణలోకి తీసుకోని కార్మికులందరినీ డైలీవేజ్ కార్మికులుగా గుర్తించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానా పనికి సమానా వేతనం అమలుచేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ఇఛ్చిన జీవో నేo. 126 ద్వారా బినామీ కాంట్రాక్టర్లను తొలగించాలని APCOS {ఆప్కాస్} ద్వారా వేతనాలు చెల్లించాలని, అన్ సీజన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికి ప్రోవడెంట్ ఫండ్ కట్టాలని, డైలీవేజ్ కార్మికుడు మరణిస్తే వారి కుటుంబానికి ఏవిధంగా ఉపాధి కల్పిస్తున్నారో అదే పద్దతిని కాంట్రాక్ట్ కార్మికులకు వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. కార్మికులందరికీ జనసేన పార్టీ మద్దతు ఎప్పుడు ఉంటుంది అని కార్మికులకు కష్టం వస్తే జనసేన పార్టీ సహించబోదని జనసేన పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాడుగుల జనసేన పార్టీ జనసైనికులు రొబ్బా మహేష్, గండెం రాంబాబు, రౌతు ప్రసాద్, కలిపిరెడ్డి రాజా, కోళ్ల చిన్నా, ధరిమిశెట్టి అప్పలరాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com