ఆత్మకూరు, (జనస్వరం) : జనసేనపార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సూచనల మేరకు జనంలోకి వెళ్ళండి - వారి సమస్యలను పరిష్కరించండి అనే కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదేశాలు మేరకు ఈరోజు ఓ మారుమూల గ్రామంలో ఓ మహిళ ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించడం జరిగింది. ఆమె తన సమస్యని వివరించడం జరిగింది. ఈ విషయాన్ని ఇంచార్జ్ శ్రీధర్ కి తెలియచేసి ఆమెకి న్యాయం చేస్తాం అని పార్టీ నాయకులు శ్రీనివాస్, భరత్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేష్ ముదిరాజ్, పవన్ గౌడ్, రవి వర్మ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com