- భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేసిన ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి ( జనస్వరం ) : వికృతమాలలో వెలసిన శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయంలో రధసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువ జామునే సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపిన అర్చక స్వాములు కైంకర్యాలను పూర్తి చేసి... సూర్య భగవానుడి రాక కోసం వెంకటేశ్వర స్వామి ఉత్సవర్లను సూర్యప్రభ వాహనంపై వెంచేపు చేశారు. సూర్య భగవానుడి లేలేత కిరణాలు శ్రీ స్వామి వారి పాదాలను స్పృశించే సమయంలో భక్తులు భక్త పారవశ్యంతో మునిగిపోయారు. అనంతరం స్వామివారికి సూర్యప్రభ వాహనంలో గ్రామోత్సవం నిర్వహించారు. రధసప్తమి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రధసప్తమి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. సూర్యప్రభ వాహనంపై చిద్విలాసమూర్తిలా స్వామి వారు భక్తులను అనుగ్రహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేంకటేశ్వర ప్రసాద్ శివ ప్రసాద్ మునికృష్ణియ్యా హేమక్షి యుగంధర్, మురళి, ముని కృష్ణయ్య, హేమాక్షి, శివా రెడ్డి, జనార్ధన్ నాగయ్య, పవన్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com