నెల్లూర్ ( జనస్వరం ) : 45 వ డివిజన్ శ్రీనివాస అగ్రహారం వద్ద ఇల్లు కట్టించిన తర్వాతే కాళీ చేయండి అని ఎం ఎల్ ఏ చెప్పిన మూడు రోజుల లోనే ఇల్లు కూల్చిన సందర్భంగా జనాసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లు కట్టించిన తర్వాతే మీరు కాళీ చేయించండి అని మాట ఇచ్చి ఎం ఎల్ ఏ మాట తప్పారు. మాట తప్పటం మడిమ తిప్పటం వై సీ పీ కి అలవాటే. సాయంత్రం 6 గం పైన ప్రజలను అశక్తులను చేసి వీధిన పడేశారు ఆ సమయంలో పగలగొట్టి చట్టరీత్యా నేరం అని తెలిసినా అధికారులు స్థానికులు పై దురుసుగా ప్రవర్తించటం అమానుషం. మాయ మాటల తో ప్రజలను మోసం చేయలేరు.. ఎలాగూ అనీల్ నెల్లూరు జిల్లా లో వుండే అవకాశం లేదని చెప్పకుండానే చెప్పారు. తన నియోజక వర్గంలో ఉన్న అసమ్మతి చూసుకోకుండా పక్క 3 నియోజక వర్గాల్లో వై సీ పీ గెలవక పోతే జిల్లా లో కనపడను అని ప్రతిజ్ఞ చేస్తున్నారు. కాబట్టి ఆయనకు ఎవరూ ఓటు వేయనవసరం లేదు. మన వాడే అనుకుని గెలిపించిన ప్రజలను మొన్న కిసాన్ నగర్ ఈ రోజు ఇక్కడ అనాలోచితంగా ప్రజలను వీధికి లాగుతున్నారు. సామాన్యులకి అండగా నిలబడ గలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఒక్కరే ఈ సారి జనసేన కు అవకాశం ఇవ్వల్ని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ జనసేన తరపున పోరాడుతామని అనీల్ ఇప్పటికైనా స్పందించి నిరాశ్రయులకు న్యాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో కిషోర్ తో ప్రశాంత్ గౌడ్, షాజహాన్, శరవణ, మౌనీశ్, ప్రసన్న పాల్గొన్నారు.