Logo
Date of Publish : 06 May 2023, 4:21 am
Editor : Sake Naresh

రాష్ట్ర అభివృద్ధికై.. జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి

        పిఠాపురం ( జనస్వరం ) : పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రాష్ట్ర అభివృద్ధికై.. జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి కార్యక్రమంలో భాగంగా 9వ రోజు ఉప్పాడ కొత్తపల్లి మండలం జగ్గరాజుపేటలో జరిగింది. ఈ కార్యక్రమంలో శేషుకుమారి గారు స్థానికులతో, మత్సకరులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వారికి వున్న మంచినీటి, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు, తుపాన్ సమయాల్లో సముద్రం కోతకు గురి కాకుండా రక్షణ గోడ నిర్మించాలని మరియు సమస్యలు పరిష్కరించాలి అని కోరారు. స్థానిక జనసైనికులు మరియు మహిళలు ఉత్సాహంగా పాల్గొని, వారి మద్దతు తెలిపారు. శేషుకుమారి గారు మాట్లాడుతూ జగ్గరాజుపేట గ్రామంలో సమస్యలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయని, ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన నాయకులు ఎం చేస్తున్నారు అని ప్రశ్నించారు. జనసేన ప్రభుత్వం వచ్చాక వారికున్న రోడ్డు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వారికి కావలసిన గట్టును కూడా ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూ కొత్తపల్లి మండల ప్రెసిడెంట్ పట్టా శివ, వైస్ ప్రెసడెంట్ దొడ్డి దుర్గ ప్రసాద్, సురాడ శ్రీను, మెరుగు ఇజ్రాయేల్, విజయ్, ప్రసాద్, స్వామి, గోపి, నరసింహాముర్తి, రాజేష్, బాబ్జీ, కోటి, బాలు, అభి, రాజేష్, ప్రసాద్, జనసైనికులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com