ఆళ్లగడ్డ, (జనస్వరం) : ఆళ్ళగడ్డ నియోజకవర్గం, శిరివెళ్ళ మండలంలో నివసిస్తున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సల్లా.శివ గుర్రప్ప కు 2009 వ సంవత్సరం Y.S రాజశేఖర్ రెడ్డి హయాంలో 5 ఎకరాల భూమిని ఇవ్వగా ఆ భూమి సాగుకోసం దాదాపు 20 లక్షల పైన ఖర్చు చేసి దాదాపు 10 సంవత్సరాలు సాగు చేసుకుంటున్న భూమిని 2019లో వైసిపి ప్రభుత్వం వచ్చాక రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సల్లా శివ గుర్రప్పకి ఇచ్చిన 5 ఎకరాల భూమిని వైసిపి ప్రభుత్వం లాక్కొని అక్కడ జగనన్న కాలనీనీ ఏర్పాటు చేసి ప్లాట్స్ వేయడం జరిగింది. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సల్లా శివ గుర్రప్ప ఇదేంటి నాకు ఇచ్చిన భూమిని జగనన్న కలనిగా ప్లాట్స్ ఎలా ఇస్తారు అని ప్రశ్నించగా, అక్కడ ఉన్నటువంటి అధికారులు మీకు మరొక్కచోట 5ఎకరాల భూమిని కేటాయిస్తాము అని చెప్పిన అధికారులు ఇంత వరకు భూమిని ఇవ్వకపోగా, జగనన్న కాలనీగా మార్చిన స్థలాన్ని ఇంత వరకు పేద ప్రజలకు కూడా ఇవ్వలేదు అని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వై.విశ్వనాథ్, ఆళ్ళగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య, శిరివెళ్ళ మండలం జనసేన నాయకులు పసుల నరేంద్ర యాదవ్ వెంటనే అక్కడికి వెళ్లి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సల్లా శివ గుర్రప్ప తండ్రిని అడిగి వారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకొని ఈ విషయాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. అనంతరం విశ్వనాధ్, మల్లయ్య మీడియాతో మాట్లాడుతూ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగికి న్యాయం చేయలేని ప్రభుత్వం సామాన్యునికి ఏ విధంగా న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. కలెక్టర్, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తక్షణమే ఆర్మీ జవాన్ ఉద్యోగి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రంగ, గురునాధ్ రాయల్, పిచికె రాజు, మారేళ్ల మనోజ్, బండి రామచంద్రుడు, సజ్జల నాగేంద్ర, దూలం చైతన్య తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com