Logo
Date of Publish : 20 June 2022, 3:57 pm
Editor : Sake Naresh

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఒక్క అవకాశం ఇవ్వండి : జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి

● ఓడిపోయినా ప్రజల బాగోగులకోసం పోరాడుతున్నారు
● యువత, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు, ఇలా అన్ని వర్గాల వారికి అండగా నిలబడ్డారు
● చంద్రబాబు నాయుడుని చూసారు, జగన్ మోహన్ రెడ్డిని చూసారు, ఈసారి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకుందాం
● అవినీతి లేని పాలన అందిస్తూ ప్రజలకు కష్టం అనేది తెలీకుండా పవన్ కళ్యాణ్ కాపు కాస్తారు
● పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

     నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట ఇంటింటికీ తిరిగి ప్రజాసమస్యలు అధ్యయనం చేసే కార్యక్రమం 35వ రోజున స్థానిక 4వ డివిజన్ మైపాడు రోడ్డు సత్యనారాయణపురం, నేతాజీ నగర్ ప్రాంతంలోని పలు వీధులలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలుకరించిన కేతంరెడ్డికి పలువురు తమ సమస్యలను విన్నవించారు. ప్రతి సమస్యను సావధానంగా విన్న కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తమ వంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న సుమారు మూడు వేల కౌలు రైతు కుటుంబాలకు అండగా ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలను పవన్ కళ్యాణ్ తాను కష్టపడి సంపాదించిన దాంట్లో నుండి ఇస్తున్నారని తెలిపారు. నిన్న ఒక్క రోజే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 74 కౌలు రైతు కుటుంబాలకు సాయం అందించారని తెలిపారు. అధికారం లేకపోతేనే ప్రజలకు ఇంతలా అండగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ రేపటి రోజున అధికారం వచ్చాక ప్రజల్ని ఎంత బాగా చూసుకుంటారో అర్థం చేసుకోవాలని అన్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా ఈ మూడేళ్ళ పాటు రాష్ట్రంలోని యువత, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు, ఇలా అన్ని వర్గాల వారికి అండగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారని తెలిపారు. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని దోచేసే వ్యక్తి కాదని, ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్ర సమస్యలన్నీ తీర్చేసే శక్తి పవన్ కళ్యాణ్ అని కేతంరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుని చూసారని, జగన్ మోహన్ రెడ్డిని చూస్తున్నామని, బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పులు కనిపించాయా అని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలందరూ తమ ఆశీస్సులు అందించి పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇవ్వాలని, అవినీతి లేని పాలన అందిస్తూ ప్రజలకు కష్టం అనేది తెలీకుండా పవన్ కళ్యాణ్ కాపు కాస్తారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com