Logo
Date of Publish : 24 December 2020, 6:11 pm
Editor : Sake Naresh

కక్షసాధింపు పాలన మాని అర్హులైన పేదలకు ఇళ్లు ఇవ్వండి : జనసేన నాయకులు

కక్షసాధింపు పాలన మాని అర్హులైన పేదలకు ఇళ్లు ఇవ్వండి : జనసేన నాయకులు

                      వైస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలపై కక్ష తీర్చుకొనేందుకు కంకణం కట్టుకుందని విజయనగరం జనసేన పార్టీ నాయకులు శ్రీ ఆదాడ మోహనరావు గారు ఆరోపించారు. గురువారం ఉదయం బాలాజీ జంక్షన్ వద్దనున్న స్థానిక అంబేద్కర్ భవన్ లో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అర్ధంకాని పథకాలను పెట్టి కేవలం వైస్సార్సీపీ నాయకులకు, వారి కార్యకర్తలకే కట్టబెడుతున్నారని, గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇంటిపత్రాలు ఇచ్చి కేటాయించిన ఇళ్లకు అర్హులైన పేదలకు చెందకుండా తూట్లు పొడిచారని ఆరోపించారు. గతప్రభుత్వం చేసిన ఇసుక అవకతవకలు, ఇళ్ల కేటాయింపు మొదలగు తప్పిదాలకు ప్రజలు ఎలా గుణపాఠం చెప్పారో ఈ వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని కూడా దగ్గరలోనే ప్రజలందరూ బంగాళాఖాతంలో కలిపేందుకు ఎంతోదూరంలో లేదని, ఎందుకంటే సాక్షాత్తు వైస్సార్సీపీ శాసనసభ్యులు,నాయకులు దేశంలోనే అవినీతి పరిపాలన అందిస్తున్న ఏకైక నాయకుడు జగన్ రెడ్డి అని ఒప్పుకుంటున్నారని ఆరోపించారు. ఆఖరికి దళితులు భూములను సైతం ఈ వైస్సార్సీపీ ప్రభుత్వం లాక్కుంటుందని, దళితులకు కేటాయించిన సబ్ ప్లాన్ నిధులను కూడా మళ్లించి దుర్వినియోగం చేస్తున్నారని, ఆఖరుకు కార్పొరేట్ విద్యను, విదేశీ విద్యను దూరంచేసి దళిత విద్యార్థులకు అన్యాయం జరిగిందని అన్నారు. శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకొని రైతులకు కనీసం ఎకరాకు నీరిచ్చేపరిస్థితి లేదని, తుఫానులవలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. మరో జనసేన సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ గతంలో ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి జిల్లా విచ్చేసినప్పుడు మద్యపాన నిషేధం, అర్హులైన పేదలకు ఉచితంగా ఇళ్లు, మొదలగు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజల డబ్బుతో పేదలకు అందిస్తున్న ఉచిత ప్రభుత్వ పధకాలకు జగనన్న పేరును వాడుకోవడం తుగ్లక్ పాలనను తలపించేలా ఉందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు దాసరి యోగేష్, వంకర సురేష్, లోపింటి కళ్యాణ్, రాజేంద్రప్రసాద్, అడబాల వెంకటేష్ నాయుడు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com