నెల్లూరు ( జనస్వరం ) : జిల్లాలో నూతనంగా నమోదు చేసిన ఓట్లు, తొలగించిన ఓట్ల వివరాలను తెలపాలని జన సేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మను క్రాంత్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ను కోరారు.. ఆయన జన సైనికులతో కలిసి కలెక్టర్ తో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 27 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని ఎన్నికల కమిషన్ తెలిపిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జిల్లాలో ఎన్ని దొంగ ఓట్లు నమోదు అయ్యాయి, నూతనంగా చేర్చిన ఓట్లు, తొలగించిన ఓట్ల వివరాలు అందజేయాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలకు అందజేసిన విధంగా తమకు కూడా ఒక కాపీ అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు రాష్ట్ర నాయకులు సుందర్ రామిరెడ్డి నగర డివిజన్ ఇన్చార్జిలు శ్రీకాంత్, నగర నాయకులు ప్రవీణ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com