మైలవరం నియోజకవర్గం అన్నదాత రోడ్డు పాలు అయ్యారని జనసేన నాయకులు, మైలవరం ఇంచార్జ్ అక్కల గాంధీ రామ్మోహన్ రావు గారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం మైలవరం నియోజకవర్గంలో రైతులు పండించిన వరి ధాన్యం అకాల వర్షంకు నీటమునిగి లబో దిబో మంటున్నారు. అని మైలవరం జనసేన ఇంచార్జ్ అక్కల రామ మోహన రావు (గాంధి) అన్నారు. గత ఏప్రిల్ నెల నుండి రబి సీజన్ కు సంబందించిన ధాన్యం కొనుగోలు చేయటం ఆలస్యం అవటం, మే 27 వ తారీకు రోహిణి కార్తీ వచ్చినప్పటికి ధాన్యం కొనుగోలు చేయకపోవటం వలన ఈరోజు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షం కారణంగా మైలవరం, పూలురు, చండ్ర గుడెమ్, ఓబుళాపురం, నాగులూరు, రేడీ గూడెం, కొనపరాజు పర్వ యార్డ్, జి. కొండూరు, వెలగలేరు, కవులూరు, కొండపల్లి, గుంటుపల్లి, గొల్లపూడిలో ధాన్యం తడిసి అమ్మకానికి పనికి రాకుండా పోయింది. మిల్లర్లు దోపిడీ ఎక్కువగా వుంది. ప్రభుత్వం నిర్ణయించిన రేటు 1400 రూపాయలకి బదులు 800, 900 రూపాయలు అడుగుతున్నారు. గతంలో బస్తాకి 2 కిలోలు తరుగు కింద తీసెవారు ఇపుడు 8, 10 కేజీలు తరుగు అడుగుతున్నారు. దీనివల్ల ఎకరానికి రూ. 16,000 వేలు రైతునష్ట పోవటం జరుగుతుంది. ప్రభుత్వం తక్షణమే తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి. మిల్లర్లు దోపిడీ నుండి రైతులను కాపాడాలి రైతులకు గిటు బాటు ధర ఈపించాలి. దీనిపై స్థానిక శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు 20 రోజులు క్రితం 2 రోజులో ధాన్యం కొనుగోలు చేస్తాం అని చేపి ఇప్పటి వరుకు ఎందుకు కొనుగోలు చేయలేదు రైతులకు సమాధానం చెప్పాలని అలాగే పౌర శాఖ మంత్రి కొడాలి నాని గారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు సమాధానం చెప్పాలన్నారు. జనసేనపార్టీ తరుపున అక్కల గాంధీ గారు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com