పాలకొండ, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, హుస్సేన్ పురం పంచాయతీ నీలంపేట గిరిజన గ్రామంలో పర్యటించి వీరఘట్టం జనసేనపార్టీ నాయకులు అక్కడ ఉన్న ప్రజలు, యువతతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకొనివెళ్లాలి అని గిరిజన యువతకు దిశా నిర్దేశం చేస్తూ పద్దెనిమిది ఏళ్ళు నిండిన యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. జనసేన పార్టీలో యువతకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది జనసేన పార్టీ విధివిధానాలు, మ్యానిఫెస్టోని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటు, వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు జనసేన జాని, మత్స పుండరీకం, కర్ణేన సాయి పవన్, రాజు పిలుపునిచ్చారు. అలాగే జగనన్న కాలనీ ఇల్లు పట్టాలపై స్థానికంగా ఉన్న సమస్యలు, ఎదురవుతున్న ఇబ్బందులు యువతకు ఉపాధి అవకాశాలు లేక పడుతున్న కష్టాలు, తదితర వాటి గురించి గ్రామ యువత జనసైనికులకు తెలిపారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత వైసిపి ప్రభుత్వం పసులనలో నిర్వీర్యం అయిపోతోందని, ప్రభుత్వ ఉద్యో నోటిఫికేషన్లు, పరిశ్రమల స్థాపన లేకపోవడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనుమరుగైనయని జనసేన జాని అని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స పుండరీకం మాట్లాడుతూ యువతకు ఉజ్వలమైన భవిష్యత్తు కల్పించాలంటే అది ఎంతో చిత్తశుద్ధి కలిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం అవుతుందని, అలాంటి పవన్ కళ్యాణ్ కి రాష్ట్రంలోని యువత బాసటగా నిలవాలని సూచించారు. అలాగే జనసేన కార్యకర్తలు స్థానిక సమస్యలపై స్పందిస్తూ, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మనకు అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ అండగా ఉండటంతో పాటు, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్గంలో పయనించి ప్రజా ప్రభుత్వం తీసుకురావాలని కోరారు. కర్ణేన సాయి పవన్ మాట్లాడుతూ అలాగే పన్నుల బాదుడుతో ప్రజలను అష్టకష్టాలు పెడుతున్న వైసీపీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.సి.పి కి, సీఎం జగన్ ఓడించి గుణపాఠం చెప్పాలని అన్నారు. ప్రజలు అందరూ జనసేన పార్టీ గాజుగ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని జనసైనికులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యులు బి.పి.నాయుడు, కంటు మురళి, దండేల సతీష్, కోడి వెంకటరావు నాయుడు, వావిలపల్లి నాగభూషన్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com