Logo
Date of Publish : 03 October 2022, 4:15 pm
Editor : Sake Naresh

వీరఘట్టం మండలంలో గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 14వ రోజు కార్యక్రమం

         పాలకొండ ( జనస్వరం ) : గిరిసేన జనసేన - జనం వద్దకు జనసేన 14వ రోజు కార్యక్రమంలో భాగంగా పెద్దూరు గిరిజన గ్రామంలో పర్యటించిన వీరఘట్టం మండలం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు పర్యటించారు. జనవాణి - జనసేన భరోసా కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పవన్ కళ్యాణ్ గారు తెలుసుకునే విధానం, సమస్యల పట్ల స్పందిస్తున్న పద్ధతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మంత్రముగ్ధులను చేస్తుందని,  ప్రజలకు జనసేన భరోసాగా నిలుస్తోందని మత్సపుండరీకం అన్నారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గెలిచే వరకు ముద్దులు పెట్టి గెలిచినాక పన్నులతో గుద్దేసి బస్సు ఛార్జీలు, నిత్యవసర వస్తువుల ధరలు పెంచేసి మూడేళ్ల పాలనలో మాలాంటి వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నడు అని గిరిజనప్రజలు అంటు, తమ ప్రధాన సమస్యలు వివరించారు. అనంతరం జనసేన జాని మాట్లాడుతూ ప్రజల కోసం పోరాడుతు, ప్రజల పక్షాన నిలబడిన నాయకుడు  పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేద్దాం అని అన్నారు. దత్తి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఉచిత గ్యాస్, మహిళకు 33% రిజర్వేషన్, ఎల్.కే.జీ నుండి పీజీ ఉచిత విద్య అందించనున్నారు. రాబోయే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పలకడం ఖాయం - జనసేన విజయకేతనం తథ్యం అని కర్ణేన సాయి పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిసేన జనసేన - జనం వద్ద కు జనసేన కార్యక్రమం ద్వారా విశేష స్పందన ప్రజల నుండి వస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన క్రియాశీలక సభ్యులు బి.పి.నాయుడు, వావిలపల్లి నాగభూషన్, కంటు మురళి, గుమ్మడి సుధాకర్, దూసి ప్రణీత్, సొండి సుమన్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com