Logo
Date of Publish : 31 March 2026, 8:24 am
Editor : Sake Naresh

నాదెండ్ల మనోహర్‌తో గిరిధర్ రెడ్డి భేటీ

నెల్లూరు, మార్చి 30 (జనస్వరం) : నెల్లూరుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో టిడిపి రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మంత్రి నాదెండ్ల మనోహర్‌కు శాలువా కప్పి, పూల బొకే అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ముఖ్యంగా ధాన్య సేకరణ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పౌరసరఫరాల వ్యవస్థ మెరుగుదలపై చర్చించినట్లు తెలిసింది. జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన గిరిధర్ రెడ్డి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా సానుకూలంగా స్పందించి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ భేటీ సౌహార్ద వాతావరణంలో జరిగి, పరస్పర ఆత్మీయతను ప్రతిబింబించింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com