విశాఖపట్నం ( జనస్వరం ) : వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన ప్రమాద ఘటనా స్థలాన్ని బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి గారు పరిశీలించారు. ఈ అగ్ని ప్రమాదంలో 36 బోట్లు పూర్తిగా దగ్ధం కాగా మరో 9 బోట్లు పాక్షికంగా కాలిపోయాయని, ఈ కాలిపోయిన 45 బొట్లుపై 360 మంది మత్స్య కారులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారని స్థానికులు వివరించారు. ఈ మత్స్య కారులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వం నుంచి తగిన నష్ట పరిహారం అందేవరకు పోరాడుతమని తెలియచేసారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com