Logo
Date of Publish : 25 April 2022, 9:08 am
Editor : Sake Naresh

ఘనంగా జనసేన ఆత్మీయ సభ : టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్

     టెక్కలి, (జనస్వరం) : టెక్కలి జనసేన పార్టీ కార్యాలయంలో టెక్కలి నాలుగు మండలాల జనసైనికుల ఆత్మీయ సమావేశం ఇంచార్జ్ కణితి కిరణ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో నాలుగు మండలాల జనసైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సమావేశంలో కణితి కిరణ్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో జనసేన పార్టీ బలోపేతం చేయడానికి త్వరలో గ్రామ, మండల స్థాయి కమిటీలు వేస్తామని, అలాగే బూత్ స్థాయిలో బలోపేతానికి బూత్ ఏజెంట్లను నియమించి పార్టీ ప్రతి కార్యక్రమాన్ని గ్రామల్లో బలంగా జనాల్లోకి తీసుకు వెళ్లాలని తెలిపారు. పార్టీ బలోపేతంలో భాగంగా వీర మహిళలను సాదరంగా ఆహ్వానించాలని మహిళలను పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమంలో భాగస్వామ్యులుగా చెయ్యాలని తెలిపారు. గ్రామస్థాయిలో ఉన్న జనసైనికులు ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలి, అలాగే ఓటుహక్కు పొందేలా చెయ్యాలని తెలిపారు. ప్రస్తుత వైసీపీ నాయకత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి గ్రామస్తునకు తెలియజేసి జనసేన అధికారంలోకి వస్తే షణ్ముఖ వ్యూహం అనుసరించి ఈ రాష్ట్ర యువతకు ఏవిదంగా ఉపాధి కల్పిస్తుందో వివరించాలని, రాష్ట్రన్ని అప్పుల ఊబి నుండి ఎలా గట్టేంకించాలో మన అధినాయకుడి వద్ద ప్రణాళిక ఉందని తెలిపారు. త్వరలోనే వైసీపీ వ్యతిరేక విధానాలను జనశ్రేణులు వీధి పోరాటాలతో జనాలకు వివరిస్తామని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com