Logo
Date of Publish : 04 August 2021, 4:21 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ప్రధాన కార్యదర్శులు సమావేశం

       న్యూస్, (జనస్వరం) :  జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ప్రధాన కార్యదర్శులు సమావేశం జరిగింది. జనసేన పార్టీ చేపట్టే కార్యక్రమాలు, ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం కోసం పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ టి.శివశంకర్ గారు, శ్రీ బొలిశెట్టి సత్య గారు శ్రీ పవన్కళ్యాణ్ గారితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతంపై చర్చించారు. ఆ మూడు జిల్లాల్లో ఉన్న సమస్యలు, ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులు, విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు, పర్యావరణ సంబంధిత సమస్యలు చర్చకు వచ్చాయి. ఉత్తరాంధ్రలో ప్రజాపోరాట యాత్ర చేపట్టినప్పుడు వివిధ వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ దృష్టికి తెచ్చారని శ్రీ పవన్ కళ్యాణ్  గారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం వల్ల నిర్వాసితులైనవారికి, భూములు ఇచ్చినవారికి ఇప్పటికీ సెటిల్మెంట్ కాక పరిహారం విషయంలో న్యాయం జరగలేదని.. ఈ అంశంలో పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలపై తగిన ప్రణాళిక రూపొందించాలని శ్రీ పవన్ కళ్యాణ్  గారు స్పష్టం చేశారు. అదే విధంగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో గత కొన్నేళ్లుగా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలను గుర్తించి వారిని పార్టీ సంబంధించిన వివిధ కమిటీల్లో బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీని మరింతగా పటిష్టం పరచడానికి సమాలోచనలు జరిపారు. ఈ నెల 7వ తేదీన ఉత్తరాంధ్ర ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను క్రోడికరించాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సేవ చేస్తూ, అన్ని విషయాల్లో అండగా ఉండే విధంగా పార్టీ కమిటీల నియామకం జరగాలని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్  గారు తెలియజేశారు. ఉత్తరాంధ్రలో వివిధ ప్రాంతాల్లో కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. ఏ కర్మాగారం వల్ల ఎటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందో ప్రధాన కార్యదర్శులు శ్రీ పవన్ కళ్యాణ్  గారికి వివరించారు. ఈ సమావేశంలో పార్టీ కోశాధికారి శ్రీ ఎ.వి.రత్నం గారు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com