పాతపట్నం నియోజకవర్గం జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన గేదెల చైతన్య
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గేదెల చైతన్య గారు ఆధ్వర్యంలో కొత్తూరు మండలంలో, మండల స్థాయి సమావేశం ఈ రోజు నిర్వహించడం జరిగింది.. సమావేశంలో చైతన్య గారు మాట్లాడుతూ గ్రామస్థాయిలో నాయకత్వం అలాగే క్రియాశీలక కార్యకర్తలకుకు పంచాయితీ స్థాయిలో అనుసరించాల్సిన తీరు, అలాగే గ్రామ స్థాయిలో సమస్యలకు స్పందించవలసిన విధి విధానాలు అన్నీ పంచాయితీ కార్యకర్తలకు స్పష్టంగా వివరించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో గేదెల చైతన్య గారి తో పాటు కొత్తూరు మండల అధ్యక్షుడు అశోక్, కొత్తూరు మండల జడ్పిటిసి అభ్యర్థి జయరాజ్, పార్లమెంట్ కమిటీ సభ్యులు రాజు, శివ , భీమా రావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.