
పాతపట్నం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనపార్టీ 5 వార్డులు కైవసం చేసుకున్న మదనాపురం పంచాయితీలో అధికార పార్టీ నాయకులు ప్రజలకు అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నారని జనసేనపార్టీ నాయకులు గేదెల చైతన్య ఆరోపించారు. అధికార పార్టీ ఆగడాలు రోజు రోజుకు మితిమీరితున్నాయని అన్నారు. అలాగే పాతపట్నం నియోజకవర్గంకు సంబంధించి మెలియాపుట్టి గిరిజనుల సమస్య, పాతపట్నం మండలం త్రాగు నీరు సమస్య, మరిన్ని సమస్యలు జిల్లా కలెక్టర్ దృష్టికు తీసుకెళ్ళి పాతపట్నం జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ గేదెల చైతన్య వివరించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.