Logo
Date of Publish : 05 August 2026, 6:08 pm
Editor : Sake Naresh

వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గౌని నాగన్న, న్యాయవాదులు

అనంతపురం, ఆగస్టు 5 (జనస్వరం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మంగళవారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని నాగన్నతో పాటు పార్టీ లీగల్ సెల్ నాయకులు, న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయకులు వైఎస్ జగన్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించినట్లు వారు తెలిపారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై చురుకుగా పనిచేయాలని, పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని వైఎస్ జగన్ సూచించినట్లు నాయకులు వెల్లడించారు. భవిష్యత్తులో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త అంకితభావంతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో న్యాయవాదులు ఉమాపతి, నాగరాజు (బాబ్జి), గౌని నాగన్నతో పాటు పలువురు పార్టీ లీగల్ సెల్ నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com