Logo
Date of Publish : 22 February 2026, 1:24 am
Editor : Sake Naresh

గ్యాస్ సిలిండర్ పేలుడు.. బాధిత కుటుంబానికి లోకం మాధవి సహాయం

నెల్లిమర్ల, ఫిబ్రవరి 22, (జనస్వరం) : నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం గంత్లాం గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించి ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. చిట్టిబాబు నివాసంలో జరిగిన ఈ ఘటనలో గృహోపకరణాలు, ఫర్నిచర్, దుస్తులు సహా సమస్త సామగ్రి కాలిపోవడంతో కుటుంబానికి భారీ నష్టం వాటిల్లింది. ఘటన గ్రామంలో ఆందోళన కలిగించింది. విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

తక్షణ సహాయంగా రూ.15 వేల నగదు మరియు రూ.15 వేల విలువైన నిత్యావసర సరుకులను అందజేశారు. ప్రభుత్వం ద్వారా మరింత ఆర్థిక సహాయం అందేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గృహ పునర్నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ పాలు శ్రీను, సర్పంచ్ ప్రతినిధులు, జనసేన నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యే స్పందనపై కృతజ్ఞతలు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com