
పాలకొండ, (జనస్వరం) : పాలకొండ నియోజకవర్గము నందివాడ గ్రామంలో జనసైనికులకు, ప్రజలకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మీద జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసైనికులు యొక్క సంక్షేమం కోసమే పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. అలాగే క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్లకి అనుకోకుండా ఎటువంటి ప్రమాదం అయినా జరిగితే వైద్య ఖర్చుల నిమిత్తం 50 వేలు, మరణించినట్లయితే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.