పాలకొండ ( జనస్వరం ) : నియోజకవర్గం స్థానిక పాలకొండ దేవరపేట వీధికి చెందిన కుర్ర. కోటేశ్వరరావు, పుట్టికతో అంధుడు కావడంతో గత కొంత కాలంగా తన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు వారి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి 8000/- రూ” ఆర్థిక సహయం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గర్భాపు నరేంద్ర, మాధాసి సంతోష్ కుమార్, డొంపాక సాయి కుమార్, వారాడ సతీష్ కుమార్ పరామర్శించడం జరిగింది.