ప్రకాశం ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మరియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారి సూచన మేరకు డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్ గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా జనచైతన్య యాత్ర 56వ రోజు ఒంగోలులోని 28వ డివిజన్ లో పర్యటించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ముఖ్యంగా జనసేన పార్టీ జనచైతన్య యాత్ర బృందం ముందు తీసుకొని వచ్చిన సమస్య ఒక్కటే మున్సిపల్ యంత్రాంగం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. కాలువల్లో మురుగునీరు నిలిచిపోవడంతో, దోమల స్వైర విహారంతో రోగాల బారిన పడుతున్నామని అన్నారు. చెత్త వేస్తున్న పాయింట్ ను మార్చమంటే మీరే ఒక పాయింట్ చూపించండి అని ప్రజలను తిరిగి ప్రశ్నిస్తున్న మున్సిపల్ సిబ్బంది, ఇది ఎంతవరకు సబబు అని జన చైతన్య యాత్ర బృందం ముందు వారి గోడును తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ సంబంధిత అధికారులు దృష్టికి మన ప్రాంత సమస్యలను తీసుకొని పోయి పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, వీర మహిళ మాదాసు సాయి నాయుడు మరియు జనసేన నాయకులు చెన్ను నరేష్, చంగలశెట్టి రాఘవ, పఠాన్ కాలేషా, నరసింహారావు, తాటిపత్రి జాన్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com