గజపతి నగరం ( జనస్వరం ) : న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడిల, ఉద్యోగుల సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని గజపతినగరం జనసేన సమన్వయకర్త మర్రాపు సురేష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి.. 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాట్యూటీ కల్పించాలి. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలన్నారు. అంగన్వాడీల సమ్మెకు, సమ్మెకు సంఘీభావం తెలిపారు. అంగన్వాడి, ఉద్యోగుల అండగా జనసేన పార్టీ నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శిలు బాబు పాలూరి, జనసైనికులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com