గుంటూరు ( జనస్వరం ) : రాజుపాలెం మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షులుగా నియామతులైన పసుపులేటి వెంకటస్వామి, అంచుల అనేష్, గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా గాదె వెంకటేశ్వర రావు గారు వారికి నియామక పత్రాలు అందజేసి మండలం లో ప్రతి ఒక్కరిని సమన్వయ పరుచుకుంటూ జనసేనపార్టీని బలోపేతం చేయాలని అన్నారు. ఈ సందర్బంగా మండల ప్రధాన కార్యదర్శి కేదారి రమేష్, కార్యదర్సులు బిట్రగుంట సాంబశివరావు, తమ్మిశెట్టి మహేష్, కంభంపాటి వరప్రసాద్,సంయుక్త కార్యదర్సులు పసుపులేటి ఓబయ్య,గలభ నాగేశ్వరావు,కొడమోడు గ్రామ పార్టీ అధ్యక్షులు దూదేకుల శ్రీను భాషా, రాజుపాలెం మండలం నాయకులు తోట నాగేశ్వరావు, అంకళ్ల డేవిడ్, తోటకూర సాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com