Logo
Date of Publish : 11 April 2023, 5:20 pm
Editor : Sake Naresh

ఇల్లు కోల్పోయిన బాధితులను పరామర్శించిన గాదే వెంకటేశ్వరరావు

              గుంటూరు ( జనస్వరం ) : రుద్రవరం గ్రామంలో అగ్ని ప్రమాదంలో ప్రమాదవశాత్తు దగ్ధమైన ఇళ్లను పరిశీలించి ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులను పరామర్శించిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు. రుద్రవరం గ్రామంలో ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో నాలుగు ఇల్లు పూర్తిగా మంటల్లో పూర్తిగా కాలిపోయినవి. ఈ ప్రమాదంలో నాలుగు పూరీలు పూర్తిగా కాలిపోయి ఇంట్లో ఉన్న సామాగ్రి మరియు నగదు మిర్చి అమ్మగా వచ్చిన నగదు, దాదాపు ఇంట్లో ఉన్న అన్ని బూడిదయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారికి తెలియజేయగా, వెంకటేశ్వర గారు ఈరోజు పొద్దున గ్రామాన్ని సందర్శించి ప్రమాదంలో ఇల్లు కోల్పోయారో ఆ కుటుంబాలతో మాట్లాడి వాళ్లకి జనసేన పార్టీ తరఫున మేము అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది.. జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరావు గారి సూచనల మేరకు ముప్పాల మండల ఎమ్మార్వో గారిని కలిసి బాధితుల కుటుంబాలను ప్రభుత్వం వారు పూర్తిస్థాయిలో పరిశీలన చేసి వారికి పక్కా గృహాలు నిర్మించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం వారు అండగా నిలబడాలని జనసేన పార్టీ తరపున వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రుద్రవరం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు సుబ్బారావు, జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీనివాసరావు, దమ్మాలపాడు ఎంపిటిసి సిరిగిరి రామారావు, మాదల అధ్యక్షులు తిరుమలశెట్టి గోపి, తిరుమల శెట్టి సాంబ, శూలం రాజ్యలక్ష్మి,కేదారి రమేష్,అంచుల ఆనేష్ , ఐలం ఆదినారాయణ, రాడ్లు శ్రీనివాసరావు, రుద్రజడ శివయ్య, సురంశెట్టి సతీష్ ,జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com