గుంటూరు, (జనస్వరం) : గుంటూరు జిల్లా క్రోసూరు చెరువులో విచ్చలవిడిగా అధికార పార్టీ నాయకులు మట్టి తవ్వకాలు జరగడంతో ఆ త్రవ్వకాలను గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన షాడో సర్పంచ్, షేక్ మస్తాన్ అనే వ్యక్తి, అక్రమ తవ్వకాలతో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని, అదేమని అడిగితే అడిగిన వారిపై అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఒక ట్రక్కుకు, 200 రూపాయలు, లారీకి వెయ్యి రూపాయల లోడింగ్ కి చొప్పున వేలాది ట్రక్కులు, వేలాది లారీలు మట్టి తరలించారని, ఇలా వందలాది లారీలతో చెరువులు తవ్వి సొమ్ము చేసుకుంటున్నారని వైసిపి నాయకులుపై మండిపడ్డారు. ఇకనైనా అక్రమ తవ్వకాలు మానుకోకపోతే రెండు రోజుల తర్వాత జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. జనసేన పార్టీ తరఫున, సమస్యలపై పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని, దానికి జనం సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆడప మాణిక్యరావు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా కమిటీ కార్యదర్శి నక్క వంశీకృష్ణ, గుంటూరు జిల్లా జనసేన పార్టీ కమిటీ ప్రధాన కార్యదర్శి యర్రంశెట్టి రామకృష్ణ, గుంటూరు జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు శాఖమూరి శ్రీనివాస్, గుంటూరు జిల్లా లీగల్ కమిటీ సంయుక్త కార్యదర్శి బయ్యవరకు నరసింహారావు, అచ్చంపేట మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మట్టం వీరభద్రరావు, సత్తెనపల్లి నియోజకవర్గం సిరిగిరి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.