బైరిపురం, (జనస్వరం) : మెరక ముడిదం మండలం బైరిపురం గ్రామంలో గడప గడపకు జనసేన కార్యక్రమం రేగిడి లక్ష్మణరావు, జనసేనపార్టీ విజయనగరం జిల్లా నాయకులు, మెరకముడిదాం మండల అధ్యక్షులు రౌతు కృష్ణవేణి, అగురు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. రేగిడి లక్ష్మణరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర యువత కోసం జనవరి 12 తారీఖున శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఈ సభకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువత అధికంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని అలాగే యువతకు ఉన్న సమస్యల పట్ల యువత ఉద్యోగుల కోసం ఉత్తరాంధ్ర నుంచి అధికంగా వలసలు వెళ్ళడానికి గల కారణాలు ఉత్తరాంధ్రలో యువపారిశ్రామికులు కోసం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రంలో ఉన్న 100 మంది యువ నాయకుల్ని సెలెక్ట్ చేసి వారిచేత ఉత్తరాంధ్ర ఎదుర్కొంటున్న వెనుకబాటుతనానికి గల కారణాల గురించి వేదిక పై మాట్లాడటానికి అవకాశం కల్పించారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని సభను విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇవ్వాలని, మనం చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిపాలన చూడ్డానికి ఆయనకు ఒక అవకాశం ఇచ్చి మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని యువత భవిష్యత్తును కాపాడాలని మహిళల రక్షణకు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా యువశక్తి పోస్టర్లు, జనసేనపార్టీ క్యాలెండర్స్, ప్రైమ్ నైన్ న్యూస్ క్యాలెండర్లు విడుదల చేయడం జరిగింది. మండల అధ్యక్షులు రౌతు కృష్ణవేణి మాట్లాడుతూ యువశక్తి ప్రోగ్రాం ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు చీపురుపల్లి నియోజకవర్గం ఐటీ వింగ్ కోఆర్డినేటర్ అగర్ వినోద్ కుమార్, బంటుపల్లి గౌరినాయుడు(శంకర్), పైలా ధనుంజయ్, లంక జగదీష్ కుమార్, కల్లేపల్లి కాంతారావు, సరిది ఈశ్వరరావు, కిలారి సీతారాం, నూకరాజు, సీతారాం వినోద్ కుమార్, నారాయణరావు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, అభిమానులు పాల్గొన్నారు.