నెల్లూరు ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గతంలో పనిచేసిన ప్రతి జన సైనికుడు గడప గడపకుకు చేరి వారి కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల మద్దతుతో వైసిపి పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. జనసేనపార్టీని అధికారంలోకి తెచ్చే విధంగా జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ నెల్లూరు కపాడి పాలెంలోని మాల మహానాడు అధ్యక్షురాలు కాయల మేరిని కలిసి కుటుంబ సభ్యులను కలిసి జనసేన పార్టీకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్ బద్దిపూడి, జిల్లా అధికార ప్రతినిధి కలువాయి సుధీర్, కాయల వరప్రసాద్, కాయల మేరి మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com