
గంగాధర్ నెల్లూరు ( జనస్వరం ) వెదురు కుప్పం మండలం, కురివి కుప్పం పంచాయతీ, అడపాల బైలు, పాత గుంట పంచాయితీ బందరులపల్లి గ్రామాల్లో జనం కోసం జనసేన (భవిష్యత్తు గ్యారెంటీ) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న సతీమణి స్రవంతి రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా స్రవంతి రెడ్డి మాట్లాడుతూ జనసేన తెలుగుదేశం పార్టీ సారధ్యంలో ప్రతి ఇంటికి భవిష్యత్తుకు గ్యారెంటీ ఉంటుందని, ఇప్పుడున్న పథకాల కంటే మేలైన సంక్షేమ పథకాలు అమలు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మిగతా ఐదు మండలాలతో పాటు వెదురుకుప్పం మండలాన్ని తల మానికంగా చేస్తామని, నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు, బడుగు బలహీనవర్గాలు, ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ ప్రజలకి అన్ని విధాలుగా, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబులు దోహదపడతారని, వారి అండదండలు ఎప్పుడు ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. 41 బూత్ లో ఉన్న 41 గ్రామాలను మొదటి సంవత్సరంలోని ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో గతంలో ఎన్నో పోరాటాలు చేసి, నిరసన కార్యక్రమాలు చేసి, ఆమరణ నిరాహార దీక్ష చేసి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన, అహర్నిశలు ప్రజల కోసమే పరితపిస్తున్న ప్రజా నాయకుడు, ప్రజల కష్టాన్ని అవగతం చేసుకున్న ఆశ్చర్యమైన ఆలోచన శక్తి కలిగిన నాయకుడు డాక్టర్ యుగంధర్ పొన్న, జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు అందరం మీకు అందుబాటులో ఉంటామని, మీ అభివృద్ధి కోసమే మా జీవితాల్ని త్యాగం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వెదురుకుప్ప మండల అధ్యక్షులు పురుషోత్తం, ఉపాధ్యక్షులు మునిరత్నం శెట్టి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, వెదురుకుప్పం మండల యువజన అధ్యక్షులు సతీష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జనసేన సీనియర్ నాయకులు నాదముని, రుద్రయ్య, జనసైనికులు పాల్గొన్నారు.