Logo
Date of Publish : 29 June 2023, 3:54 pm
Editor : Sake Naresh

కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

        నెల్లూరు ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 313వ రోజున 9వ డివిజన్ నవాబుపేట నజీర్ తోటలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్ళిన కేతంరెడ్డి ప్రజా సమస్యలను అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అడ్డగోలు విధానాలతో విసిగి వేసారి పోయిన ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా కావాలని బలంగా కోరుకుంటున్నారని అన్నారు. వారాహి విజయ యాత్రకి వస్తున్న స్పందన చూసి అధికార వైసీపీకి కంటి మీద కునుకులేకుండా పోతోందని అన్నారు. రానున్న ఎన్నికల అనంతరం ఏది ఏమైనా సరే ప్రజలందరి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కానున్నారని, ఇందులో తమకు ఎలాంటి సందేహాలు లేవని కేతంరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com