-పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాగానే అర్హులైన ప్రతి ముస్లింకి 10లక్షల రూపాయల సబ్సిడీ ఋణాలిస్తాం
-పవనన్న ప్రభుత్వంలో ప్రతిభ కల్గి పదిమందికి ఉపాధి చూపే యువతకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా 10లక్షల రూపాయల పెట్టుబడి సాయం ఇస్తాం
-పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని 175వ రోజున 42వ డివిజన్ ఖుద్ధూస్ నగర్ 2వ వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు కార్పొరేషన్ ద్వారా అందాల్సిన ఋణాలు అందకుండా ఉచితాల పేరుతో ప్రక్కదారి పట్టాయన్నారు. దీంతో స్వయం ఉపాధి పొందే మైనారిటీ యువత ప్రభుత్వ సబ్సిడీ సాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాగానే ముస్లిం మైనారిటీలను ఆదుకునే విధంగా అర్హులైన ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఋణాలు అందిస్తామని అన్నారు. అదేవిధంగా ప్రతిభ కలిగి పదిమందికి ఉపాధి చూపగల యువతకి పవనన్న ప్రభుత్వంలో తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా పదిలక్షల రూపాయలు పెట్టుబడి సాయం క్రింద అందజేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com