అరకు, (జనస్వరం) : అరకు మండలం సిరాగం పంచాయతీ పరిధిలో గల లాంతాంపాడు గ్రామంలో జనసేన పార్టీ నాయకులు సాయిబాబా, దూరియా, అల్లంగి రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారము ఆయా గ్రామంలో పర్యటించడం జరిగింది. ముందుగా గ్రామ ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు లేకపోవడం, పాఠశాల ప్రారంభం అయినప్పటి నుండి ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోవడం వలన, చదువుకు విద్యార్థులు ఆమడ దూరంలో ఉంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు జనసేన పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులును నియమించినప్పటికి, రెండు నెలలు విధులు నిర్వర్తించి అనంతరం మరొక పాఠశాలకు వెళ్ళిపోతామని, కేవలం డిప్యుటేషన్ మీద విద్యాశాఖ అధికారులు పంపించారని విద్యార్థుల తల్లిదండ్రులు జనసేన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు సాయిబాబా, దూరియా, అల్లంగి రామకృష్ణ మాట్లాడుతూ ఈ సమస్యను మా సమస్యగా తీసుకొని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని గిరిజనులతో చెప్పారు. ఇంత సమస్యతో విద్యార్థులు చదువుకు ఆమడదూరంలో ఉంటే ఈ సమస్య ప్రభుత్వాన్ని కనిపించట్లేదా అని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇదేనా వైయస్సార్ ప్రభుత్వం నైజమని, ఇటువంటి ధోరణి వ్యవహరిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రతి ఒక గిరిజనులు బుద్ధి చెప్పాలని వారితో సూచించారు. అనంతరం మూతబడిన పాఠశాల వద్దకు వెళ్లి విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు జనసేన ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ద్వారా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఓ గిరిజన తల్లి బిడ్డను జనసేన పార్టీ పరామర్శించి, అనంతరం పంచాయతీ హెడ్ క్వార్టర్ సచివాలయానికి వెళ్లి అధికారుల దృష్టికి ఆయా గ్రామలో ఉన్నటువంటి సమస్యలను వినతి పత్రం ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామ ప్రజలు తదితురులు పాల్గొన్నారు.