పిఠాపురం, (జనస్వరం) : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణ ప్రజలకు మంచి నీరు అందించే చిత్రాడ పరిధిలోగల రిజర్వర్ చెరువులో వేలాది చేపలు చనిపోవడంతో మంచి నీరు కలుషితమయందని ఇది అధికారులు నిర్లక్ష్యం వలనే జరిగిందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ చార్జ్ మాకీనీడి శేషుకుమారి స్థానిక జనసేన పార్టీ ఆపీసులో మీడియాలో ఆరోపించారు. చేపలు చనిపోయి ఐదురోజులు గడచిన తరువాత ఎవరికి తెయకుండా రహస్యంగా కుళ్ళిన చేపలను ట్రాక్టర్ లతో బయట పారవేయడం జరిగిందని, ఐదురోజు కుళ్ళిన చేపలవలన మంచినీరు ఎంత కలుషితం అయివుంటుందో పట్టింపు లేకుండా శుద్ధి చేయకుండా అదే నీటిని ప్రజలకు అందించడం దారుణంమని అసలే వర్షాకాలం సీజనల్ వ్యాధులు టైమ్ లో ఇలాంటివీ జరగకుండా చూడవలసిన అధికారులు నిర్లక్ష్యం తగదని క్లోరిన్ లాంటివి వాడకుండా ఆ సోమ్మును దుర్వినియోగం చేస్తున్నారని 33 కోట్ల రిజర్వుడ్ నిర్మాణ ం ప్రజలకు ఉపయోగకరంగా లేదని పుష్కలమైన గోదారి నీరు బదులు బోరు వాటర్ అందిస్తున్నారని వాటర్ పైపులైనుకూడా పూర్తి ఛేయకుండా కప్పివేయడంవలన గోదారినీరు అందించడంలేదని ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూడాలని శేషుకుమారి అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com