Search
Close this search box.
Search
Close this search box.

ఉచితాలు దండగయ్యా… కష్టం చేసుకునే వారికే డబ్బులు అందాలి : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

కేతంరెడ్డి వినోద్ రెడ్డి

         నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి చేపట్టిన పవనన్న ప్రజాబాట ఎనిమిదో రోజున మైపాడు రోడ్డు ప్రాంతంలోని రామిరెడ్డి కట్టెల దొడ్డి రోడ్డు, పుట్ట సెంటర్లో విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డితో ఈ ప్రాంతంలోని ప్రజలు ముఖ్యంగా మహిళలు తమ సమస్యలు, బాధలు చెప్పుకున్నారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం పథకాల పేరు చెప్పి ఉచితంగా డబ్బులు పంచుతోందని, దీని కారణంగా అనేకమంది సోమరిపోతులుగా మారుతున్నారని, కష్టపడి పని చేసేవారు తగ్గిపోతున్నారని, దీంతో ప్రొడక్టివిటీ దెబ్బతింటోందని కేతంరెడ్డికి పలువురు మహిళలు వివరించారు. పథకాల పేరుతో డబ్బులు మంచిదేనని, కాకపోతే ఆ డబ్బులు సరైన లబ్ధిదారులకు చేరాలని, అలా కాకుండా వేలాది కోట్ల రూపాయలు పక్కదారి పడుతున్నాయని విమర్శించారు. ఉదాహరణకు టైలరింగ్ పేరుతో టైలర్లు కాని వారందరూ డబ్బులు పొందుతున్నారని, ఆ డబ్బులు వృధా అవడమే కదా అని అన్నారు. ఇలా ఉచితంగా కాకుండా నిజమైన టైలర్ల నుండి ప్రభుత్వ వ్యవస్థలకు, పాఠశాలలకు, కళాశాలలకు యూనిఫారం వంటివి కుట్టించుకుని నిజమైన లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వాలని మహిళలు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా చేనేత కార్మికుల నుండి ప్రభుత్వం నేత వస్త్రాలు కొని లబ్ధి చేకూర్చవచ్చు కానీ ఉచితంగా ఇస్తే డబ్బుకు విలువ ఉండదని అన్నారు. ఇలా ప్రతి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను ప్రొడక్టివిటీ పెంచే దిశగా ఉపయోగించవచ్చని, నిజమైన లబ్ధిదారులకు చేరుతాయని, ఉచితంగా ధారపోసి ప్రజలను సోమరిపోతులుగా మార్చాల్సిన అవసరం లేదని కేతంరెడ్డి వినోద్ రెడ్డితో పలువురు మహిళలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే తరహా ఉచితాలు కొనసాగితే అతి త్వరలోనే మన రాష్ట్రం శ్రీలంక లాగా మారే అవకాశం ఉందని మహిళలు భయాందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై మహిళల్లో ఇంతటి చైతన్యాన్ని చూసిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆశ్చర్యపోయారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదిస్తే రాష్ట్రంలో సుభిక్షమైన పాలన ఉంటుందని వారికి కేతంరెడ్డి వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way