తెలంగాణ ( జనస్వరం ) : జనసేనపార్టీ ఆద్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ మాధవరెడ్డి సారథ్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించటం జరిగింది. మలివిడతలో భాగంగా సురభి కాలనీ వాసులకు కళ్ళ జోళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం చేసే కంటి పరీక్షలు నాణ్యత లేక సరైన సమయానికి కంటి అద్దాలు అందించకపోవటం వల్ల కంటి సమస్యలు అధికమవుతాయి అని తెలియచేశారు. కానీ మాధవ రెడ్డి ఈ సేవా కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి సకాలంలో కంటి అద్దాలు అందించటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పర్యవేక్షణ కమిటీ మెంబర్ సురేష్ రెడ్డి, అరుణ్, ప్రదీప్, జి.ఎస్.కె శ్రావణ్, ప్రశాంత్, కళ్యాణ్ చక్రవర్తి, ప్రవీణ్ సాహు, జయానంద్, రోహిత్ రెడ్డి, ఉపేంద్ర, కామరాజు, నాగరాజు ఇతర జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com