మదనపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక యన్.టి.ఆర్ సర్కిల్,కోర్టువీధి రాజభవన్ ఫంక్షన్ హాలు నందు ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, ఎన్ఆర్ఐ కిరణ్ ల పర్యవేక్షణలో ఈ వైద్యశిభిరం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఇందులో జనరల్ ఫిజీషియన్, గైలకాలజి కన్సల్టేషన్, కార్డియాలజి కన్సల్టేషన్, డెర్మటాలజి, చిన్నపిల్లల వైద్యసేవలు, కీళ్లు మోకాళ్ళ నొప్పులను ఎదుర్కొంటున్న రోగులకు పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు.ప్రముఖ వైద్యులు శంకర్ జవాలాంత్, డాక్టర్ కరిష్మా,డాక్టర్ సూర్య తేజ, డాక్టర్ శ్రీనాథ్, డాక్టర్ షాదుతుల్లా, స్టాఫ్ నర్స్ అమరావతిలు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి సూచనలు, సలహాలు అందజేశారు.ఈ సందర్బంగా జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజ నేయులు మాట్లాడుతూ జనసేన పార్టీ కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, ప్రజల ప్రజల సంక్షేమం ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.ప్రజలు ఆరోగ్యానికి అధికంగా వ్యయం చేయాల్సి వస్తున్న నేపథ్యంలో వారికి ఉచితంగా వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రానున్న రోజుల్లోనూ మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజల ముందు ఉంటామన్నారు.అనంతరం దారం అనిత మాట్లాడుతూ జనసేన పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును రోగులు సద్వినియోగం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల స్ఫూర్తితో ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయడంతో పాటు సేవా కార్యక్రమాలతో ముందుంటామన్నారు. ఎన్ఆర్ ఐ కిరణ్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన వైద్యాన్ని ఉచితంగా అందించి వారిలో సంతోషాన్ని చూడటమే ఉచిత వైద్యశిభిరం లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దారం హరి, పవర్ ఆఫ్ టీమ్ అధ్యక్షులు గోపాల కృష్ణ, కిరణ్ కుమార్ రెడ్డి, పాల్గుణ, రామిశెట్టి నాగరాజు, బండి భార్గవి, ముత్యాల ఆంజనేయులు, నరేంద్ర, లక్ష్మి పతి, ఆకుల శంకర్, నళిని, వినయ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు.