ఉప్పల్ ( జనస్వరం ) : నియోజకవర్గం కృష్ణానగర్ కాలనీ మీర్పేట్ డివిజన్ జనసేన పార్టీ నాయకులు కొల్లు. నరేష్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ లో, మదర్ హుడ్ హాస్పిటల్ వారి సహాయ సహకారంతో ఫ్రీ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నరేష్ నాయుడు మాట్లాడుతూ... హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడానికి సహాయ సహకారాలు అందించిన హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఇలానే మీ ద్వారా ప్రజలకు మరెన్నో సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు మీర్పేట్ డివిజన్ అధ్యక్షులు కొమ్మినేడి శేషు,
తాడివాక వెంకటేశ్వరరావు, కొమ్మినేడి రాము, రామాంజనేయులు, రామ్మూర్తి, సాంబశివరావు గారు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com