శేరిలింగంపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా శేరిలింగంపల్లి నియోజక వర్గ ఇంఛార్జి గౌరవ డాక్టర్ మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఆల్విన్ కాలని 124 డివిజన్ అద్యక్షులు అబోతుల మాధవరావు గారి నాయకత్వం లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలని వాసులు విశేషంగా పాల్గొని ఉచిత వైద్య శిభిర సేవలు వినియోగించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కాలని వాసులు పెరుగుతున్న ఖర్చులు అవసరాలలో ఇబ్బంది పడుతున్న వారికి ఈ ఉచిత వైద్య శిభిరం ఎంతగానో ఉపోయోగకరం ఉందని తెలియచేశారు. సమాజం పట్ల బాధ్యత, సేవ చేసే లక్షణం కలిగి ఉండటం అరుదుగా ఉన్న నేటి సమాజంలో జనసేన పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల కాలనివాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రావ్యనిక వైద్య బృందం మరియు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ డివిజన్ కోఆర్డినేటర్లు వీర మహిళలు, జన సైనికులు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com